పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రారంభం..ఆ ఆరుగురికి మరోసారి నోటీసులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన అంశం..పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ జారీ చేసిన నోటీసులు. ఇటీవల BRS పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరినట్లు ఆరోపణలు రావడంతో, శాసనసభ స్పీకర్ దీనిపై సీరియస్‌గా స్పందించారు. సమాచారం ప్రకారం, స్పీకర్ ఆరుగురు ఎమ్మెల్యేలకే కాకుండా ఫిర్యాదు చేసిన BRS సభ్యులకు కూడా నోటీసులు పంపించారు. పార్టీ మార్పు సంబంధిత ఆరోపణలపై తగిన ఆధారాలు సమర్పించాలని, తద్వారా విచారణను ముందుకు తీసుకెళ్లవచ్చని స్పీకర్ నోటీసుల్లో స్పష్టం చేశారు....