అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలో హింస, కాల్పుల ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో విషాదం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా రామయ్య బౌలికి చెందిన 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహమ్మద్ నిజాముద్దీన్‌ను స్థానిక పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 3న జరిగినప్పటికీ, రెండు వారాల తర్వాతే ఈ విషయం ఆయన కుటుంబానికి తెలిసింది. దీంతో బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిజాముద్దీన్, మొదట ఫ్లోరిడాలో చదువుకొని తర్వాత కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు....