తొరూర్ సహకార సంఘంలో ఖజానా లూటి…?
కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని రైతు సహకార సంఘం కోపరేటివ్ బ్యాంకులో భారీగా అవకతోకలు వెలుగులోకి వచ్చాయి. సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ చట్టబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైనట్టు సమాచారం. నాబార్డ్ మార్గదర్శకాలను ఉల్లంఘించి అధిక ఖర్చులు చేయడం ఆడిట్ రిపోర్టులోని చూపిన లోపాలను సరి చేయకపోవడం వార్షిక బడ్జెట్ సిద్ధం చేయకపోవడం వంటి అంశాలు తీవ్ర లోపాలుగా గుర్తించినట్లు సమాచారం. కమిటీ సభ్యులలోని డిఫాల్టర్లు ఉండటం, సహకార సంఘంలో అవినీతి ఎంత లోతుగా ఉందో బహిర్గతం...