బొమ్మనపల్లి స్కూల్లో బతుకమ్మ సంబురాలు..!!
కాకతీయ, కొత్తగూడెం రూరల్: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు పిటిఎం సమావేశం నిర్వహణతో పాటు ముందస్తు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్(ఎస్ జి ఎఫ్) సారధ్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు బతుకమ్మలను తయారు చేసుకొని వచ్చి పాఠశాల ప్రాంగణంలో అందరూ కలిసి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ పొగాకు లక్ష్మి, బొమ్మనపల్లి జిల్లా...