హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్‌తో సీఎం భేటీ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కార్యాలయంలో శనివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై ఈ భేటీలో చర్చించారు. కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు సీజే సూచించారు. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.ప్రాధాన్యత వారీగా రాష్ట్రంలోని...