జ‌న‌గామ సీఐ దామోదర్ రెడ్డిని సన్మానించిన సీపీఎం నాయకులు..!!

కాకతీయ జనగామ టౌన్ : బదిలీపై వెళ్తున్న జనగామా రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ దామోదర్ రెడ్డిని సీపీఎం జనగామా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో శ‌నివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎస్ హెచ్ ఓ గా విధులను సమర్ధవంతంగా నిర్వహించారని కొనియాడారు. గ‌తేడాది జరిగిన ఓ అగ్నిప్రమాద ఘటనను అదుపు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించిన దుర్గమ్మ పండుగ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ‌ట్టి బందోబస్తుకు చొరవ...