భూపాలపల్లిలో సీఎం, ఎమ్మెల్యే దిష్టి బొమ్మల‌ను ద‌హ‌నం..!!

కాకతీయ, వరంగల్ బ్యూరో : భూపాల పల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇసుక దోపిడీపై నిరసనలు హోరెత్తాయి. ఇటీవల టేకుమట్ల మండల కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించి, అనంతరం వాటిని దహనం చేశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ ఎస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి...