సన్న, చిన్నకారు రైతుల అభివృద్ధికే ఈజీఎస్..!!

కాకతీయ, పినపాక: ఉపాధి హామీ పని పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రారంభించిందని పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పినపాక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఉపాధి హామీ కార్మికులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుపేదలు ఆదాయ ఆర్జనకు ఉపయోగపడుతుందన్నారు. ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తాతారావు, ఎంపీడీవో సునీల్...