Homebound : ఆస్కార్ రేస్‌లోకి జాన్వీ కపూర్.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ..!!
కాకతీయ, సినిమా డెస్క్: జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ‘హోమ్ బౌండ్’ సినిమా విడుదలకు ముందే విశేష గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2026 అవార్డుల కోసం భారత తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. శుక్రవారం సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఎన్. చంద్ర ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండియా నుంచి పోటీ పడిన 24 చిత్రాల్లో నుంచి ‘హోమ్ బౌండ్’ కు ఈ ప్రతిష్టాత్మక అవకాశం దక్కడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించి...