కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. హరీశ్ రావుపై కోపం లేదు.. కవిత యూటర్న్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కొత్త పార్టీ ఆవిర్భావం గురించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. గతంలో సీఎం కేసీఆర్ కూడా పార్టీ ఏర్పాటు చేయడానికి ముందే వందలాది మంది మేధావులు, నేతలతో చర్చలు జరిపారని గుర్తుచేశారు. ప్రస్తుతం తాను కూడా అదే తరహాలో ఆలోచనలు, చర్చలు కొనసాగిస్తున్నానని తెలిపారు. తండ్రి పార్టీ అయిన బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయ్యింది తానేనని...