భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకుందాం..!!

కాకతీయ, బయ్యారం : పచ్చని చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడితే భావితరాలకు మంచి భవిష్యత్ ను అందించిన వార‌మ‌వుతామ‌ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ యానాల వెంక రెడ్డి అన్నారు. శనివారం బయ్యారం మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో యంగ్‌ ఎర్త్‌ లీడర్స్‌ కార్య క్రమంలో భాగంగా గ్రీన్‌ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీరు కలుషితం కాకుండా సంరక్షణ చేయాలన్నారు. ఔషధ తోటలు వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. చెట్లు మనిషి జీవన...