సీనియర్ జర్నలిస్టుపై మంచు లక్ష్మి ఫిర్యాదు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నటి మంచు లక్ష్మి, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ఎప్పటినుంచో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన దక్ష – ది డెడ్‌లీ కాన్‌స్పిరసీ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండడంతో, ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఒక సీనియర్ సినీ జర్నలిస్టు వీఎస్ఎన్ మూర్తికి ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చనీయాంశమైంది. ఇంటర్వ్యూలో జర్నలిస్టు.. “మీ వయసు 50 దాటబోతుంది.. ఈ వయసులో ఎందుకు ఇలాంటి డ్రెస్‌లు వేసుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. దీనిపై మంచు లక్ష్మి తీవ్రంగా స్పందిస్తూ,...