పేదరికంతో ఎవరూ విద్యకు దూరం కావొద్దు..!!

కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సప్తగిరి కాలనీలో 6–10వ తరగతి విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన అధ్యయన పుస్తకాలను ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు అందించారు. ఈ సందర్భంగా ఆయన శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణ, వినయం, విధేయతతో మాణిక్యాలలా వెలుగొందుతారని, పేదరికం కారణంగా ఎవరూ విద్యకు దూరం కాకూడదని అన్నారు. ఫీల్డ్ ట్రిప్‌లకు ఉచిత బస్సులు, పదవ తరగతిలో 10 జిపిఏ 570 మార్కుల పైగా సాధించిన విద్యార్థులకు ఉచిత...