ఎంపీడీవో కార్యాలయాన్ని చుట్టుముట్టిన ప్రజా సంఘాలు..!!
కాకతీయ, ఆత్మకూరు : అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మదాసి సురేష్ అన్నారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రజా సంఘాలు ముట్టడించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల్లో పారదర్శకత లేదని ఆరోపించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వం పథకాలు ఇస్తున్నారని, నిజమైన నిరుపేదకు సంక్షేమ పథకాలు అందడం లేదని పేద ప్రజలకు అన్యాయం...