సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..!!
కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణిలో పనిచేస్తున్న పర్మినెంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు సంక్షేమానికి పాటుపడాలని యూనియన్ గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ శివరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ శనివారం వినతిపత్రం అందజేశారు. వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలని, సొంత ఇంటి పథకం అమలు, మెడికల్ బోర్డు ఏర్పాటు, అందరిని ఆన్ ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు...