లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.!!

కాకతీయ, స్టేషన్ ఘనపూర్ : రాష్ట్రాన్ని నాశనం చేసిందే బీఆర్ ఎస్ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుద్దపూసల లాగా నీతులు చెప్పే అర్హత ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాలలోని రైతు వేదికలలో శ‌నివారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలేరు మండలంలో 13 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.13.01 లక్షల...