విద్యార్థులు కష్టపడి చదవాలి..!!
కాకతీయ, రాయపర్తి : ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదవాలని, అలాంటప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకొని ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలుగుతామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుగులోత్ కిషన్ అన్నారు. శనివారం మండలంలోని మైలారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు అజ్మీరా ఉమాదేవి అధ్యక్షతన స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో హాజరై మాట్లాడారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శార ఆదేశానుసారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని లక్ష్య సాధనకై కష్టపడి...