పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..!!

కాకతీయ, కరీంనగర్ : పేదల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఇల్లంతకుంట మండల పరిషత్ సమావేశ మందిరంలో 19 మందికి కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కులు, 51 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం కోసం పథకాల అమలులో వెనుకంజ వేయడం లేదని తెలిపారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు,...