వికసిత్ భారత్ పోటీలు .. గెలిచిన వారికి ప్రధాని తో మీటింగ్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్‌ను 2047 నాటికి వికసిత్ దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఆ దిశగా యువతలో సృజనాత్మకతను పెంపొందించేందుకు, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడానికి “వికసిత్ భారత్ పోటీలు” నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పోటీల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాయిలో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావచ్చు. వ్యాసరచన, క్విజ్, ఆర్ట్, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు వంటి విభాగాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత భవిష్యత్తు, అభివృద్ధి దిశలో తమ ఆలోచనలను సృజనాత్మక...