బాధితులకు న్యాయం జరిగేలా పని చేయాలి: అంబర్ కిషోర్ ఝా
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ అంబర్ కిషోర్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరస్థులకు శిక్షపడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావు గా జరిగేలా చూడాలని సీపీ సూచించారు....