సింగరేణి అభివృద్ధికి కృషి చేయాలి..!!
కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణి కాలరీస్ కంపెనీ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి, కార్మికుడు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం తిరుమల రావు అన్నారు. సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ ఎం)బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కొత్తగూడెం ఏరియాను శనివారం ఆయన సందర్శించారు. ముందుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు కొత్తగూడెం ఏరియా తరపున పూలమొక్క అందించి శాలువాతో స్వాగతించారు. అనంతరం డైరెక్టర్ కొత్తగూడెం ఏరియాలోని అధికారులు సూపర్వైజర్లు ఎంతమంది పనిచేస్తున్నారు ఇంకా ఎంతమంది వేకెన్సీ ఉందని సంబంధిత అధికారులతో...