పెద్దపల్లిని అగ్రగామిగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే విజయరమణ రావు
కాకతీయ, పెద్దపల్లి : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాలతో పెద్దపల్లిని అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని ఆయన తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారుల చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే, స్థానిక తహసిల్దార్, నాయకులతో కలిసి 820 మంది సీఎంఆర్ఎఫ్, 133 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...