అడవి పిల్లికి బోనుపెడితే.. మొసలి చిక్కింది..!

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ గ్రామంలో ఓ రైతు పత్తి చేనులో అడవి పిల్లులు త‌ర‌చూ వస్తూ పంట న‌ష్టం చేస్తున్నాయి. పత్తికాయలను తొలుస్తూ నష్టం చేస్తుండటంతో స‌మ‌స్య ప‌రిష్కారానికి అదే గ్రామానికి చెందిన వేటగాడిని ఆశ్ర‌యించాడు. స‌ద‌రు వేట‌గాడు చేనులో శనివారం బోను అమ‌ర్చి ఎప్ప‌టిలానే వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఆదివారం తెల్ల‌వారు జామున బోను అమ‌ర్చిన ప్ర‌దేశం వద్దకు వెళ్ళి చూడగా మొస‌లిని చూసి ఒక్క‌సారిగా అవ‌క్కాయ్యాడు. దీంతో ఈనోటా ఆనోటా మొసలి చిక్కిందని ప్ర‌చారం...