బతుకమ్మను బతికిద్దాం .. భావితరాలకు చాటుదాం .!!
కాకతీయ, గీసుగొండ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ. ఇది పూల పండుగ మాత్రమే కాదు; ప్రకృతిని పూజించే మనసు, స్త్రీ శక్తిని గౌరవించే ఆచారం, సమాజ సమైక్యతను కాపాడే సాంప్రదాయం. మన పక్క రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు విగ్రహ ప్రతిష్టాపనతో జరుపు కుంటారు. ప్రతిరోజూ అమ్మవారికి విభిన్న రూపాల్లో అలంకరణలు చేసి పూజలు నిర్వహిస్తారు. కానీ తెలంగాణ ప్రత్యేకత వేరే. ఇక్కడ తొమ్మిది రోజులు .. తొమ్మిది రకాల బతుకమ్మలు పేర్చుతారు. సహజ పూలతో అలంకరించి, జానపద గీతాలతో, మహిళల సమైక్యతతో,...