విశ్వనాధపురం, సింగ్య తండాల్లో భారీ దొంగతనాలు..!!

కాకతీయ, గీసుకొండ: తండాలను టార్గెట్ చేస్తూ దొంగలు బీభత్సం సృష్టించారు. సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని విశ్వనాధపురం గ్రామం, సింగ్య తండాలలో నిన్న రాత్రి గుర్తుతెలియని దొంగలు రెండు గ్రామాల్లో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు.బాదావత్ దేవ్ సింగ్,వాంకుడోతు రవీందర్, అక్కినేపల్లి ప్రదీప్, భూక్య బిక్షపతి ఇళ్లలోకి దొంగలు చొరబడి బంగారు, వెండి ఆభరణాలు, అలాగే నగదు దోచుకెళ్లినట్లు సమాచారం. మొత్తం విలువ రూ.1,69,690/- గా అంచనా వేయబడింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు సీఐ...