సెలవుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!!

కాకతీయ, వరంగల్ బ్యూరో : దసరా పండుగ సెలవుల సమయంలో ప్రజలు తమ ఇండ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, సెలవులను పురస్కరించుకొని స్వగ్రామాలు, విహార యాత్రలకు వెళ్తున్న సందర్భంలో చోరీలు నివారించేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు సీపీ సూచనలు.. బయటికి వెళ్తున్నప్పుడు సెంట్రల్ లాక్, సెక్యూరిటీ...