జీఎస్టీ వల్ల నష్టమేంటో చెప్పండి: బండి సంజయ్

కాకతీయ, కరీంనగర్ : జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు జరిగిన నష్టమేమిటో స్పష్టంగా చెప్పకుండా, ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడటం సరికాదని కేంద్ర హోం మంత్రివర్గ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. నిజంగా సమస్యలు ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు. కరీంనగర్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయనకు...