రామప్పను సందర్శించిన అమెరికా పర్యాటకులు ..!!

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన పర్యాటకులు సందర్శించారు. ఎమిలీ, అన్నా, జాక్, రిచర్డ్, మార్గరెట్ లు ఆలయాన్ని వీక్షించి శిల్పకళా వైభవానికి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, నిర్మాణ ప్రత్యేకతల గురించి సౌత్ ఇండియన్ గైడ్ రాజేంద్ర, స్టేట్ గైడ్ మధు, రామప్ప టూరిజం గైడ్ విజయ్ కుమార్...