గల్లిగల్లినా దేవినవరాత్రులు..!!
కాకతీయ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ బోయిగూడా మెట్టుగూడా పద్మారావు నగర్ లో నేటి నుండి దేవినవరాత్రులు ప్రారంభమవుతున్న వేళ వాడ వాడలా అమ్మవారి మండపాలు వెలిసాయి. ప్రత్యేక విద్యుత్ దీపాలతో మండపాలను అలంకరించారు. రాష్ట్రంలోనే బోనాలకు ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ మహంకాళి ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉండటం మరో విశేషం నవ రాత్రుల వేళ ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ ఉంటాయి. ప్రతిరోజూ భక్తులతో సందడిగా ఉంటుంది. ఆయా కాలనీల్లో వెలసిన అమ్మ వారి మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు....