సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. వారికి బోనస్ ప్రకటించింది. లాభాల్లో 34శాతం కార్మికులకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వివరాలను వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా రూ. 1,95,610 ఇవ్వున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో పలువురు మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తామని భట్టి తెలిపారు. కాంట్రాక్ట్...