జీఎస్టీ తగ్గింపు పేద, మధ్యతరగతికి ఊరట
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ : జీఎస్టీ పన్నుల తగ్గింపు నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిస్తుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బజాజ్ షోరూం వద్ద బిజెపి పట్టణ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఉపయోగించే 80% వస్తువులపై టాక్స్ తగ్గించడం ఇదే తొలిసారని అన్నారు. జీఎస్టీని మూడు అంచెల సరళ విధానంగా మార్చి, నిత్యావసరాలకు 5%, సాధారణ వస్తువులకు 18%, విలాసవస్తువులకు 40%గా అమలు చేస్తున్నట్లు...