విశాఖ, విజయవాడ మెట్రో రైల్ టెండర్లలో కీలక పరిణామం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎన్ పీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. అమ‌రావ‌తిలోని ఏపీ ఎంఆర్ సీఎల్ కార్యాల‌యం నుంచి ఆయ‌న ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. ఫేజ్ - 1 లో విశాఖప‌ట్నంలో 46.23 కిలోమీట‌ర్లు,విజ‌య‌వాడ‌లో 38 కిలోమీట‌ర్ల మేర ఉన్న 40 శాతం సివిల్ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచిన‌ట్లు రామ‌కృష్ణా రెడ్డి చెప్పారు. అయితే టెండ‌ర్ నోటిఫికేష‌న్ విడుద‌ల...