దుర్గామాతకు ఎంపీ ప్రత్యేక పూజలు
కాకతీయ, వరంగల్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారిని, వేయి స్తంభాల ఆలయంలో దుర్గామాతను సోమవారం స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, సమాజానికి శుభసూచక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయన్నారు. వరంగల్ చారిత్రక ఆలయాలు, దేవాలయాలు మన సంస్కృతి వైభవానికి ప్రతీకలని తెలిపారు. దేవి కటాక్షంతో ప్రజలందరూ...