సైబర్ నేరాల పై ప్రజలకు అవగహన కల్పించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా
కాకతీయ, కరీంనగర్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ వారియర్స్‌తో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీసీఏస్‌బి హైదరాబాద్ పంపిన టీ-షర్టులను సైబర్ వారియర్స్‌కు అందజేశారు. అనంతరం సమావేశంలో సీపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నందున ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. అలాగే, తమకు అప్పగించిన బాధ్యతను నిర్లక్ష్యం లేకుండా నిర్వర్తిస్తూ,...