దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్ గా తెలంగాణ..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇటలీ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణను దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా తీర్చిదిద్దాలని ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణలో ఏరోస్పేస్్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకంగా కాంపోనెంట్ తయారీ, సప్లై చైన్, మెయింటెనెన్స్, రిపేర్ & ఓవర్‌హాల్ (MRO), అవియానిక్స్, రాడార్ & సెన్సార్...