భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య..!!
కాకతీయ, వరంగల్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారిని, వేయి స్తంభాల ఆలయంలో దుర్గా మాతను సోమవారం స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని, సమాజానికి శుభసూచక మార్గదర్శకత్వాన్ని అందిస్తాయన్నారు. వరంగల్ చారిత్రక ఆలయాలు, దేవాలయాలు మన సంస్కృతి వైభవానికి ప్రతీకలని తెలిపారు. దేవి కటాక్షంతో ప్రజలందరూ...