డ్యూటీ డాక్టర్లపై దాడి హేయం
నిందితులను తక్షణం అరెస్టు చేయాలి విధులు బహిష్కరించిన వైద్యులు, హోరెత్తిన నిరసనలు ఉద్రిక్తంగా మారిన ఏరియా ఆస్పత్రి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న డాక్టర్లు, డాక్టర్లతో చర్చిస్తున్న అదనపు కలెక్టర్ కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని మహబూబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే ఆదివారం రాత్రి నల్లెల్ల గ్రామానికి చెందిన పలువురు వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఆ సమయంలో వైద్యులు డ్యూటీలో లేరంటూ , సిబ్బందితో వాగ్వివాదం ముదిరి తోపులాట వరకు...