జీఎస్టీ తగ్గింపు పట్ల సామాన్యులలో సంబరాలు..ప్రధాని మోదీకి కృతజ్ఞతలు..!!
కాకతీయ, నల్లబెల్లి: జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలపై ఉన్న పన్ను భారము తేలిక పడి, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్న చారిత్రక నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించింది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, బ్యూటీ మరియు ఫిజికల్ సర్వీసులు,...