Chicken: భార్య చికెన్ వండలేదని సూసైడ్ చేసుకున్న భర్త..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, గోళ్లవిడిసిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం .. ఇంట్లో ప్రతిరోజూ పచ్చడి, అన్నం పెడుతున్నారని భార్యతో విభేదాలు జరుగుతుండేవి. ఆదివారం కావడంతో చికెన్ వండమని భార్యను కోరినప్పటికీ ఆమె వండకపోవడంతో భర్త లక్ష్మీనారాయణ (25) తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ఏడాదిన్నర వయసున్న బాబు...