మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి..!!
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని శ్రీ సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మంగళవారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా గద్దెల ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, మేడారం పూజారులు సాంప్రదాయ నృత్యాలు, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, ఎస్సి, ఎస్టీ గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి...