కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన..!!
కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఎస్ సి సి డబ్ల్యూ ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి కాంటాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కొత్తగూడెంలోని రైటర్ బస్తి బాబు క్యాంపులో కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జిలతో జెండాలతో నిరసన చేపట్టారు. కొత్తగూడెం రీజియన్ నాయకులు నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్...