పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలి

జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం రూరల్: జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక, రవాణా పోలీస్ శాఖలతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పత్తి కొనుగోలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ విధానాల ప్రకారం మద్దతు ధర పొందేలా, ప్రతీ అధికారి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 1,72,937 ఎకరాలలో...