గ్రామాల్లో తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
కాకతీయ, జూలూరుపాడు : మండలంలోని అన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు వెంటనే అన్ని గ్రామల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చాంద్ పాషా మాట్లాడుతూ తీవ్ర వర్షాల వల్ల గ్రామాల్లో విష జ్వరాలు, మలేరియా, టైఫాడ్, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలం అయ్యాయని, దీంతో గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వ్యాధులను నయం చేసుకునేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలాది రూపాయలను...