భారీ దొంగ‌త‌నం.. 30 తులాల బంగారం చోరీ..!!

కాకతీయ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో వరుస దొంగతనాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణ కాలనీ, నాగారం ప్రాంతంలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానిక నివాసి పవన్ శర్మ తన ఇంటికి తాళం వేసి పూజల కోసం వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టబడి ఉండటంతో అనుమానం కలిగింది. లోపలికి వెళ్లి చూసే సరికి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇంటి బీరువా ధ్వంసం చేసి అందులో...