వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య కాకతీయ,ఆత్మకూరు : కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న స్వస్థనారి సశక్తి పరివార్ అభియాన్ మెగా వైద్య శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రములోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్యశిబిరాన్ని సందర్శించి మాట్లాడారు ఇప్పటివరకు ఐదు రోజులలో మొత్తం 40 ప్రత్యేక వైద్య శిబిరములు నిర్వహించామ‌ని ఆయన తెలిపారు. ఈ నెల 24 తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దామెర, 25 తేదీన సిద్దాపూర్, రాయపర్తి...