రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి

మతోన్మాద రాజకీయాలను ఎండగట్టాలి: ఎస్ఎఫ్ఐ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కరీంనగర్‌లోని ముకుందలాల్ మిశ్రా భవనంలో మంగళవారం రాష్ట్ర విద్యా-వైజ్ఞానిక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ...