దాశరథి రంగాచార్య సతీమణి కన్నుమూత ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రచయిత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు దాశరథి రంగాచార్య సతీమణి దాశరథి కమల (92) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆమె హైదరాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో చివరి శ్వాస విడిచారు. 2015 జూన్‌లో దాశరథి రంగాచార్య మృతి చెందిన విషయం తెలిసిందే. కమల మృతి తెలుసుకున్న వెంటనే వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానికులు పెద్దఎత్తున మారేడ్‌పల్లిలోని ఆమె నివాసానికి చేరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దాశరథి రంగాచార్య–కమల దంపతులకి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు....