స్టేజ్‌పైనే గుండెపోటుతో ద‌శ‌ర‌ధుడి మృతి.. వీడియో వైరల్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చంబా జిల్లాలో జరుగుతున్న రామ్ లీల ప్రదర్శనలో సీనియర్ ఆర్టిస్ట్ అమ్రిష్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. దశరథుడి పాత్ర పోషిస్తున్న సమయంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో స్టేజ్‌పైనే కుప్పకూలిపోయారు. మంగళవారం రాత్రి జరిగిన లైవ్ ప్రదర్శనలో ఈ దుర్ఘటన జరిగింది. తన డైలాగులు చెబుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనకు ఛాతీనొప్పి మొదలై, మాటలు ఆగిపోయాయి. కొద్దిసేపటికి నేల కూలిపోయారు. అక్కడే ఉన్న ఇతర నటులు, ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. నిర్వాహకులు వెంటనే...