Maoists: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. భద్రతా దళాల కాల్పల్లో ముగ్గురు మావోలు మృతి..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: మావోయిస్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లా అడవుల్లో బుధవారం ఉదయం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 8 గంటల సమయంలో బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఆపరేషన్‌లో జార్ఖండ్ జాగ్వార్స్, గుమ్లా పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా పాల్గొన్నారు. నిషేధిత జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (JJMP) మావోయిస్టులు లక్ష్యంగా ఉండగా, జరిగిన కాల్పుల్లో ముగ్గురు సభ్యులు...