బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
సింగరేణి జీఎం (పర్సనల్) వెల్ఫేర్ కిరణ్ కుమార్ కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఈనెల 27న ప్రకాశం స్టేడియంలో జరిగే బతుకమ్మ ప్రధాన వేడుకలు, ఫ్యామిలీ డే కార్యక్రమానికి వచ్చే ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జీఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఏర్పాట్ల నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మను పురస్కరించుకొని 25న సింగరేణి ప్రధాన కార్యాలయంలో, 27న కార్పొరేట్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం...